బంగారం స్కాంతో సింహాచలం దేవస్థానానికి సంబంధం లేదు: ఇన్‌‌చార్జ్ ఈవో

ABN , First Publish Date - 2020-09-03T18:12:11+05:30 IST

బంగారం స్కాంతో దేవస్థానానికి ఎటువంటి సంబంధం లేదని ఇన్‌చార్జ్ ఈవో త్రినాథరావు స్పష్టం చేశారు.

బంగారం స్కాంతో సింహాచలం దేవస్థానానికి సంబంధం లేదు: ఇన్‌‌చార్జ్ ఈవో

విశాఖపట్నం: బంగారం స్కాంతో దేవస్థానానికి ఎటువంటి సంబంధం లేదని ఇన్‌చార్జ్ ఈవో త్రినాథరావు స్పష్టం చేశారు. ఈ స్కాంకు సంబంధించిన విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులకు దర్శనాలు పెంచే ఆలోచన చేస్తున్నామని చెప్పారు. దేవాదాయ శాఖ ఆదాయం పెంపునకు ప్రణాళికలు సిద్ధం చేస్తామని...ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని ఇన్‌చార్జ్ ఈవో త్రినాథరావు వెల్లడించారు.


బంగారం అమ్ముతామంటూ మోసం

సింహాచలం అప్పన్న బంగారం అమ్ముతామంటూ ఓ మహిళ పెద్ద మొత్తంలో మోసానికి పాల్పడింది. నెల్లూరుకు చెందిన శ్రావణికి హైమావతి  అనే మహిళ రూ.1.40 కోట్లకు టోకరా వేసింది. కరోనా వల్ల ప్రచారం చేయలేదని నెల్లూరు మహిళను నమ్మించి మోసానికి పాల్పడింది. ఆలయ ఈవో భ్రమరాంబ వేలంకి అనుమతి ఇచ్చినట్లు ఫోర్జరీ నోటీసును చూపించి ఇంత దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే రసీదు ఇచ్చి బంగారం ఇవ్వకపోవడంతో అనుమానంతో ఆలయ అధికారులను సంప్రదించగా... అలాంటి సంప్రదాయం లేదని  అధికారులు చెప్పారు. 

Updated Date - 2020-09-03T18:12:11+05:30 IST