విశాఖ శారదాపీఠంలో బ్రహ్మణులకు నిత్యావసరాలు పంపిణీ

ABN , First Publish Date - 2020-04-21T17:37:42+05:30 IST

విశాఖ శారదాపీఠంలో బ్రహ్మణులకు నిత్యావసరాలు పంపిణీ

విశాఖ శారదాపీఠంలో బ్రహ్మణులకు నిత్యావసరాలు పంపిణీ

విశాఖపట్నం: విశాఖ శారదాపీఠంలో నిరుపేద బ్రాహ్మణులకు నిత్యావసరాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర నిత్యావసరాల కిట్లను స్వయంగా బ్రహ్మణులకు అందజేశారు. ఒక్కో కిట్లలో బియ్యంతో పాటు పంచదార, చింతపండు, కందిపప్పు, శనగపప్పు, మినపప్పు, ఉప్పు, కారం, వంటనూనెను అందజేశారు. ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర మాట్లాడుతూ కరోనా ఆంక్షల కారణంగా పురోహితులు, అర్చకులు, బ్రాహ్మణులు కష్టాలు అనుభవిస్తున్నారని అన్నారు.  తొలి విడతగా శారదాపీఠం పరిసరాల్లోని పేద బ్రాహ్మణులకు నిత్యావసరాలు పంపిణీ చేశామని చెప్పారు. మరిన్ని పేద బ్రాహ్మణ కుటుంబాలకు ఇదే తరహా ఆర్ధిక సాయమందిస్త‍ామని ఆయన తెలిపారు. విశాఖ శారదాపీఠంలో చదువుతున్న వేద విద్యార్థుల తల్లిదండ్రులకు బ్యాంకు అకౌంట్ల ద్వారా ఆర్థిక సాయం అందజేయనున్నట్లు స్వరూపానందేంద్ర వెల్లడించారు. 

Updated Date - 2020-04-21T17:37:42+05:30 IST