-
-
Home » Andhra Pradesh » Visakha Saradha Peetham Reference to AP Government
-
ఏపీ ప్రభుత్వానికి విశాఖ శారదా పీఠం సూచన
ABN , First Publish Date - 2020-03-25T14:45:05+05:30 IST
ఏపీ ప్రభుత్వానికి విశాఖ శారదా పీఠం సూచన

విశాఖపట్నం: కరోనా వైరస్ ప్రభావం ప్రపంచంలోని అన్ని దేశాలపై పడింది. ఈ వైరస్ భారత దేశాన్ని కూడా కుదిపేస్తుంది. ఇది ప్రాణాంతక వ్యాధిగా మారడంతో.. కరోనా వైరస్ బారి నుంచి ప్రజలను కాపాడేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు అభినందనీయం అని విశాఖ శారదా పీఠం తెలిపింది. జనతా కర్ఫ్యూ పేరుతో స్వచ్ఛందంగా ప్రజలు ఇంటికి పరిమితం అవ్వాలని ప్రధాని మోదీతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పిలుపునివ్వడం మంచి పరిణామం అని తెలుపుతూ.. ఈ సందర్భంగా విశాఖ శారదా పీఠం తరపున ఏపీ ప్రభుత్వానికి చిన్న సూచన చేసింది. ఈరోజు ఉదయం నుంచి పలు వృద్ధాశ్రమాలకు చెందిన వయోవృద్ధులు విశాఖ శారదా పీఠానికి ఫోన్ చేశారని.. జనతా కర్ఫ్యూ ప్రభావం తమపై పడుతుందని దీంతో తమకు అన్న, పానాలు సైతం అందడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఏపీ ప్రభుత్వానికి విశాఖ శారదా పీఠం తెలిపింది. ఇలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్న వయోవృద్ధులకు ఆహారం అందే విధంగా ప్రభుత్వం తరపున ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచన చేసింది.