మేఘాలతో హాయ్‌.. హాయ్‌

ABN , First Publish Date - 2020-11-21T08:53:19+05:30 IST

ఇవి ఉత్తర భారతంలోని మంచు కొండలు కావు... మన విశాఖ మన్యంలో అడవులను కమ్మేసిన మంచు దుప్పటి.

మేఘాలతో హాయ్‌.. హాయ్‌

పాడేరు: ఇవి ఉత్తర భారతంలోని మంచు కొండలు కావు... మన విశాఖ మన్యంలో అడవులను కమ్మేసిన మంచు దుప్పటి. తెల్లవారితే చాలు.. పాడేరు మండలం వంజంగి పంచాయతీలోని కొండలు, లోయలు వెండి మబ్బుల్లా మారి సుందర దృశ్యాన్ని ఆవిష్కరిస్తున్నాయి. ఉదయం పది గంటల వరకూ ఈ దృశ్యాన్ని తనివితీరా వీక్షించవచ్చు. అందుకోసమే పర్యాటకులు అధిక సంఖ్యలో ఇక్కడికి తరలివస్తున్నారు.


Read more