విశాఖ డిఫెన్స్ అకాడమీ విద్యార్థుల ఆందోళన

ABN , First Publish Date - 2020-11-27T02:15:44+05:30 IST

విశాఖ డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. సర్టిఫికెట్లు ఇవ్వకుండా తమను వేధిస్తున్నారంటూ నిరసన

విశాఖ డిఫెన్స్ అకాడమీ విద్యార్థుల ఆందోళన

కృష్ణా: విశాఖ డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. సర్టిఫికెట్లు ఇవ్వకుండా తమను వేధిస్తున్నారంటూ నిరసన చేపట్టారు. ఉంగుటూరు మండలం తేలప్రోలులోని అకాడమీ వద్ద ఆందోళన చేస్తున్నారు. ఎటువంటి ప్రభుత్వ అనుమతి లేకుండా.. అకాడమీ నడుపుతూ రూ.లక్షల్లో వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే రూ.2 లక్షల ఫీజులు కట్టించుకున్నారని వాపోయారు. సర్టిఫికెట్ల కోసం మరో రూ.2 లక్షలు కట్టాలని వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సత్వరమే అకాడమీపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.

Updated Date - 2020-11-27T02:15:44+05:30 IST