ఆ ఆరోపణలన్నీ అవాస్తవం..: విశాఖ కలెక్టర్

ABN , First Publish Date - 2020-04-21T21:06:52+05:30 IST

నగరానికి సంబంధించి కరోనా కేసుల సంఖ్యను దాస్తున్నారని వస్తున్న ఆరోపణలను జిల్లా కలెక్టర్ వినయ్ చందన్ కొట్టిపారేశారు. ఆ ఆరోపణల్లో

ఆ ఆరోపణలన్నీ అవాస్తవం..: విశాఖ కలెక్టర్

విశాఖపట్నం: నగరానికి సంబంధించి కరోనా కేసుల సంఖ్యను దాస్తున్నారని వస్తున్న ఆరోపణలను జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ కొట్టిపారేశారు. ఆ ఆరోపణల్లో ఎంతమాత్రం వాస్తవం లేదన్నారు. టెస్టింగ్ ల్యాబ్‌లు అన్నీ ఐసీఎంఆర్ ఆధ్వర్యంలో నడుస్తున్నాయని కలెక్టర్ తెలిపారు. ఆ డేటాను నేరుగా ఆన్‌లైన్లోనే అప్‌లోడ్ చేస్తున్నారని వివరించారు. విశాఖ నగరంతో పాటు జిల్లాలో ఉన్న అన్ని మున్సిపాలిటీల పరిధిలో లాక్‌డౌన్ యధావిధిగా కొనసాగుతుందని చెప్పారు. విశాఖలో ఇప్పటి వరకు మొత్తం 21 కరోనా పాజిటీవ్ కేసు నమోదయ్యాయని చెప్పారు. ప్రస్తుతం ఐసోలేషన్‌లో నలుగురు ఉన్నారని, 17 మందిని డిశ్చార్జ్ చేశామన్నారు. విశాఖ జిల్లాకు 18వేల ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు వచ్చాయని కలెక్టర్ వెల్లడించారు. ఐదు కేటగిరులుగా విభజించి ఎప్పటికప్పుడు టెస్టులు చేస్తున్నామని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా నాలుగో దశ కూడా సర్వే కొనసాగుతోందని కలెక్టర్ వినయ్ తెలిపారు. నాలుగైదు రోజుల్లో ఈ సర్వే పూర్తవుతుందన్నారు. గతంలో పాజిటివ్ వచ్చిన వారితో దగ్గరి సంబంధాలు ఉన్న వారందరినీ, అలాగే విదేశాల నుంచి వచ్చిన వారికి కూడా మరోసారి కరోనా పరీక్షలు చేస్తున్నామని కలెక్టర్ వివరించారు.

Updated Date - 2020-04-21T21:06:52+05:30 IST