గ్రామాల్లోనే వ్యవసాయ ఉత్పత్తులు కొనండి

ABN , First Publish Date - 2020-04-05T08:33:19+05:30 IST

రైతు పక్షాన నిలబడి వారికి న్యాయం చేయాలని, వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు ప్రక్రియను గ్రామాల్లోనే చేపట్టాలని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆదేశించారు. రాష్ట్రంలో ధాన్యం క్రయ విక్రయాలకు సంబంధించి ఏ ఒక్క

గ్రామాల్లోనే వ్యవసాయ ఉత్పత్తులు కొనండి

  • రైతు పక్షాన నిలిచి న్యాయం చేయండి.. గవర్నర్‌ ఆదేశం

అమరావతి, ఏప్రిల్‌ 4(ఆంధ్రజ్యోతి): రైతు పక్షాన నిలబడి వారికి న్యాయం చేయాలని, వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు ప్రక్రియను గ్రామాల్లోనే చేపట్టాలని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆదేశించారు. రాష్ట్రంలో ధాన్యం క్రయ విక్రయాలకు సంబంధించి ఏ ఒక్క రైతుకూ ఇబ్బంది కలగకూడదని అన్నారు. ఈ మేరకు శనివారం మార్కెటింగ్‌, పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులను రాజ్‌భవన్‌కు పిలిపించి సమీక్షించారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలోను వ్యవసాయ పనులు ఆగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని, ఆహార ధాన్యాల ఉత్పత్తికి అవాంతరం ఏర్పడితే పలు ఇక్కట్లను ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు.

Updated Date - 2020-04-05T08:33:19+05:30 IST