మెడికల్‌ క్రౌడ్‌ ఫండింగ్‌లో అగ్రస్ధానంలో విజయవాడ

ABN , First Publish Date - 2020-12-31T00:25:12+05:30 IST

మెడికల్‌ క్రౌడ్‌ ఫండింగ్‌లో అగ్రస్ధానంలో విజయవాడ

మెడికల్‌ క్రౌడ్‌ ఫండింగ్‌లో అగ్రస్ధానంలో విజయవాడ

విజయవాడ: మెడికల్‌ క్రౌడ్‌ఫండింగ్‌ పరంగా విజయవాడ నగరం అగ్రస్ధానంలో ఉందని, ఒక్క విజయవాడలోనే రూ. 2.5 కోట్ల పైగా సమీకరించినట్లు మిలాప్‌ అధ్యక్షుడు, కో-ఫౌండర్‌ అనోజ్‌ విశ్వనాథన్‌ పేర్కొన్నారు. దాదాపు 14 వేల మంది దాతలు, 1000 పైగా క్యాంపెయిన్‌లకు తోడ్పాటునందించారు. వైద్య అవసరాలకు క్రౌడ్‌ ఫండింగ్‌ యొక్క ఆవశ్యకత పరంగా స్పష్టమైన వృద్ధి కనిపిస్తుందన్నారు.  విజయవాడ నుంచి ఏర్పాటు చేస్తోన్న ఫండ్‌ రైజర్లలో దాదాపు 75 శాతం ఫండ్‌రైజర్లు వైద్య పరమైన అవసరాలకే ఉంటున్నప్పటికీ, ఈ నగరం నుంచి సమీకరించిన 2.5 కోట్ల రూపాయల నిధులలో దాదాపు 95 శాతం ఈ కారణాల కోసమే ఉన్నాయని చెప్పారు. 


ప్రియదర్శినికి చెందిన శిశువు నెలలు నిండకుండానే జన్మించడంతో ఆ శిశువును ఎన్‌ఐసీయు కేర్‌లో ఉంచారని, శిశువు తండ్రి శివరామ్‌ ఓ క్రౌడ్‌ ఫండింగ్‌ క్యాంపెయిన్‌ ఆరంభించారు. తద్వారా విజయవాడ నగరంలో సుదీర్ఘకాలం పాటు ఆ శిశువుకు చికిత్సనందించాలనుకున్నారు. అప్పటికే ఆయన రూ. 11 లక్షలు ఖర్చు చేశారు. తన దగ్గర ఉన్న పొదుపు మొత్తం కరిగి పోయింది. మిలాప్‌పై చేసిన ఈ క్యాంపెయిన్‌ ద్వారా ఆయన 350 మంది మద్దతుదారుల సహకారంతో దాదాపు రూ. 20 లక్షలను సమీకరించారని చెప్పారు. 


ఇదే రీతిలో ఆదిత్య అనూషకు జన్మించిన శిశువు కోసం ఓ ఫండ్‌ రైజింగ్‌ కార్యక్రమం ప్రారంభించారు. తమ కుమారునికి పుట్టుకతోనే సమస్యలు రావడంతో ఆయన ఈ ఫండ్‌ రైజింగ్‌ ప్రారంభించారు. అప్పటికే ఆయన 2.7 లక్షల రూపాయను ఖర్చు చేయడం వల్ల పొదుపు మొత్తం కరిగిపోయింది. ఇక చికిత్స పరంగా ముందుకు వెళ్లే అవకాశాలు ఎంత మాత్రం లేవనుకుంటున్న వేళ ఆయన బంధువులలో ఒకరు ఫండ్‌ రైజింగ్‌ ప్రారంభించమని సలహా ఇచ్చారు. 


‘దాదాపు 20 రోజుల లోపుగానే నేను మూడు లక్షల రూపాయలను రూ. 300 మంది దాతల నుంచి పొందానని ఆదిత్య చెప్పారు. ఈ క్యాంపెయిన్‌ మేనేజర్‌ తనకు ఏ విధంగా నిధులను సమీకరించాలో ఆదిత్య తెలిపారు. సోషల్‌మీడియా, బంధువులు, స్నేహితులకు ఈ సందేశాలను పంపాలో కూడా తెలిపారు. ఆస్పత్రి బిల్లులను సకాలంలో చెల్లించేందుకు ఈ ప్రక్రియ తనకు తోడ్పడిందని అన్నారు. 


మిలాప్‌, క్రౌడ్‌ఫండింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ప్రధానంగా వ్యక్తిగత వైద్య కారణాల కోసం ఉద్దేశించబడినది సంస్థ తెలిపింది. ఇప్పటి వరకూ దాదాపు రూ. 1200 కోట్లను 4.2 లక్షల మంది దాతల నుంచి ఆరోగ్యం, అత్యవసరం, విద్య, చారిటీ మొదలైన కారణాల కోసం సమీకరించింది.

Updated Date - 2020-12-31T00:25:12+05:30 IST