-
-
Home » Andhra Pradesh » vijayawada tdp leader devineni uma
-
పట్టిసీమ వట్టిసీమన్నారు...ఈరోజు ఏం సమాధానం చెబుతారు?: దేవినేని
ABN , First Publish Date - 2020-06-23T18:40:01+05:30 IST
పట్టిసీమ వట్టిసీమన్నారు...ఈరోజు ఏం సమాధానం చెబుతారు?: దేవినేని

విజయవాడ: పట్టిసీమ వట్టిసీమ అన్న వైసిపి నేతలు ఈ రోజు ఏం సమాధానం చెబుతారని మాజీ మంత్రి దేవినేని ఉమ ప్రశ్నించారు. మంగళవారం పట్టిసీమ ద్వారా కృష్ణమ్మ ఒడికి చేరుకున్న గోదావరి జలాలకు పవిత్రసంగమం వద్ద దేవినేని ప్రత్యేక పూజలు చేశారు. పట్టిసీమ నుంచి ఆరవ ఏడాది కృష్ణమ్మ చెంతకు గోదావరి నీరు చేరింది. ఈ సందర్భంగా దేవినేని మాట్లాడుతూ పోలవరం పూర్తవడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉన్నందున కృష్ణాడెల్టాను కాపాడేందుకు పట్టిసీమ ద్వారా నీరు తరలించామని తెలిపారు. ఇప్పటి వరకు పట్టిసీమ ద్వారా కృష్ణమ్మకు 350 టీఎంసీల నీరు వచ్చిందన్నారు.
పట్టిసీమ మోటర్లను పీకివేస్తామన్న వైసిపి నాయకులు ఇప్పుడు ఎందుకు నోరు మెదపడంలేదని ఆయన నిలదీశారు. పట్టిసీమకు గోదావరి నుంచి నీరు తరలించడం ద్వారా శ్రీశైలంలో ఉండే కృష్ణాజలాలను రాయలసీమ ప్రాంతవాసులకు అందిస్తున్నామని తెలిపారు. పట్టిసీమ నుంచి ఆరవ ఏడాది నిరంతరాయంగా కృష్ణానదికి నీరు రావడంపై చాలా సంతోషంగా ఉందని దేవినేని ఉమ అన్నారు.