మధ్యప్రదేశ్ రూట్‌లో ఏపీ వెళ్లాలి: కేశినేని

ABN , First Publish Date - 2020-04-26T18:30:06+05:30 IST

ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న తమ రాష్ట్రానికి చెందిన వలస కూలీలను వెనక్కి రప్పించేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైన విషయం తెలిసిందే.

మధ్యప్రదేశ్ రూట్‌లో ఏపీ వెళ్లాలి:  కేశినేని

విజయవాడ: ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న తమ రాష్ట్రానికి చెందిన వలస కూలీలను వెనక్కి రప్పించేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైన విషయం తెలిసిందే. వారికోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్టు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. ఈ నిర్ణయం పట్ల విజయవాడ ఎంపీ కేశినేని నాని హర్షం వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్‌ను అనుసరించి ఏపీ ప్రభుత్వం కూడా వలస వెళ్లిన స్థానికులను రప్పించేందుకు పూనుకోవాలని ట్వీట్ చేశారు. Updated Date - 2020-04-26T18:30:06+05:30 IST