విజయవాడలో యధేచ్చగా రోడ్లపైకి వాహనదారులు

ABN , First Publish Date - 2020-04-15T17:13:39+05:30 IST

విజయవాడలో యధేచ్చగా రోడ్లపైకి వాహనదారులు

విజయవాడలో యధేచ్చగా రోడ్లపైకి వాహనదారులు

విజయవాడ: లాక్‌డౌన్ నిబంధనలను నగరవాసులు బేఖాతరు చేస్తున్నారు. పోలీసులు కఠిన చర్యలు అవలంబిస్తున్నప్పటికీ  వాహనదారులు యధేచ్ఛగా రోడ్ల పైకి వస్తున్నారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు నేటి నుంచి నిబంధనలు పాటించని వారిపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించారు. ఇప్పటివరకు ఫైన్‌లతో సరిపెట్టిన పోలీసులు నేటి నుంచి వాహనాలు సీజ్ చేస్తున్నారు. చిన్న చిన్న కారణాలతో వాహనదారులు రోడ్లపైకి వస్తున్నారని, పదేపదే చెబుతున్నప్పటికీ మాటవినకపోతే వాహనాలు సీజ్ చెయ్యడం తప్పడం లేదని పోలీసులు చెబుతున్నారు. నగరంలో లాక్‌‌డౌన్ నిబంధనులను ఉల్లంగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిపి ద్వారకా తిరుమలరావు ఆదేశాలు జారీ చేశారు. దీంతో పోలీసులు నగరంలో వివిధ ప్రాంతాలలో విస్తృతంగా తనిఖీలు చేసి వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు.

Updated Date - 2020-04-15T17:13:39+05:30 IST