ఇంద్రకీలాద్రిపై క్షణాల్లో విరిగిపడ్డ కొండచరియలు.. సీసీటీవీ కెమెరాల్లో దృశ్యాలు
ABN , First Publish Date - 2020-10-22T04:50:14+05:30 IST
ఇంద్రకీలాద్రిపై అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కొండ చరియలు విరిగి పడతాయని తెలిసినా అధికారులు అక్కడ ముందు జాగ్రత్తలు తీసుకోలేదు. భక్తులు వెళ్లే ప్రాంతమని తెలిసి కూడా కేవలం బోర్డులు ..

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కొండచరియలు విరిగి పడతాయని తెలిసినా అధికారులు అక్కడ ముందు జాగ్రత్తలు తీసుకోలేదు. భక్తులు వెళ్లే ప్రాంతమని తెలిసి కూడా కేవలం బోర్డులు పెట్టి చేతులు దులుపుకున్నారు. ఘటన జరిగి గంట గడిచినా కొండ రాళ్లను తొలగించకుండా అధికారులు చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలు కాగా ఒకరిద్దరి ఆచూకీ కనిపించడంలేదని చెబుతున్నారు. దీంతో కొండ రాళ్ల కింద ఇంకా ఎవరైనా ఉన్నారా? అన్న అనుమానాలు పెరుగుతున్నాయి. అయితే దుర్గగుడి వద్ద క్షణాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.