దుర్గగుడి మూడు సింహాల మాయంలో అంతుచిక్కని మర్మం

ABN , First Publish Date - 2020-09-17T17:07:56+05:30 IST

దుర్గగుడిలో మూడు సింహాల మాయంలో మర్మం అంతుచిక్కడం లేదు.

దుర్గగుడి మూడు సింహాల మాయంలో అంతుచిక్కని మర్మం

విజయవాడ: దుర్గగుడిలో మూడు సింహాల మాయంలో మర్మం అంతుచిక్కడం లేదు. పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ఎందుకు వెనుకాడుతున్నారు... తప్పు ఒప్పుకుని సరిదిద్దుకుంటారా?...లేక నింద ప్రైవేట్ సెక్యురిటీపై నెట్టే ప్రయత్నం చేస్తారా?..వంటి జవాబు లేని ప్రశ్నలు ఎన్నో తలెత్తుతున్నాయి. సింహాల అదృశ్యంలో ఇప్పటికే మంత్రి, ఈవో సురేష్ బాబు పొంతన లేని వ్యాఖ్యలు చేశారు.  రికార్డులు పరిశీలించడానికి మూడు రోజుల సమయం దేనికి అన్న దానిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సింహాలు అపహరణకు గురైయ్యాయో లేదో తేల్చడానికా?.. పోయిన సింహాల స్థానంలో కొత్తవి అమర్చడానికా అనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. వెండి రథంలో సింహాల చోరీపై పెనుగంచిప్రోలు ఈవో నిన్న విచారణ జరుపగా... రెండో రోజు విచారణకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.  దుర్గగుడి విచారణ ఆపేసిన ఈవో ఎన్.ఇ.ఎస్.ఎన్. మూర్తి యధావిధిగా పెనుగంచిప్రోలులో విధులు నిర్వహించుకుంటున్నారు. 


Updated Date - 2020-09-17T17:07:56+05:30 IST