వెండి రథంలో మూడు సింహాలు మాయం కాలేదు: దుర్గగుడి ఈవో
ABN , First Publish Date - 2020-09-16T16:08:16+05:30 IST
ప్రముఖ పుణ్యక్షేత్రం దుర్గగుడిలో వెండి రథంలో మూడు సింహాలు మాయంపై ఈవో సురేష్ బాబు స్పందించారు.

విజయవాడ: ప్రముఖ పుణ్యక్షేత్రం దుర్గగుడిలో వెండి రథంలోని మూడు సింహాల మాయంపై ఈవో సురేష్ బాబు స్పందించారు. సింహాలు మాయం కాలేదని.. రికార్డులు పరిశీలిస్తామని ఆయన తెలిపారు. అంతర్వేది ఘటన జరిగింది కాబట్టి ఇలాంటి ఫేక్ న్యూస్‌లు వస్తున్నాయని చెప్పారు. రికార్డుల పరిశీలన కోసం మూడు రోజుల సమయం కావాలని ఈవో తెలిపారు. అయితే వెండి సింహాలు ఉన్నాయో లేవో చూసి చెప్పడానికి మూడు రోజులు సమయం ఎందుకని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం కాబట్టి భక్తులు, మీడియా ముందు రథాన్ని చూపించాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరికాసేపట్లో దుర్గగుడిలో వెండి రథాన్ని బీజేపీ, టీడీపీ, జనసేన నేతలు పరిశీలించనున్నారు.