సంప్రదాయ దుస్తుల్లో వస్తేనే అంతరాలయ దర్శనం

ABN , First Publish Date - 2020-03-18T09:50:41+05:30 IST

కనకదుర్గమ్మను అంతరాలయం నుంచి దర్శించుకోవాలనుకునే భక్తులు ఇకపై సంప్రదాయ దుస్తుల్లోనే రావాలి. పురుషులు పంచె, చొక్కా, కండువా, మహిళలు చీర, జాకెట్టు ధరించాలి. చుడీదార్లు, పంజాబీ డ్రెస్సుల్లో వచ్చే మహిళలు

సంప్రదాయ దుస్తుల్లో వస్తేనే అంతరాలయ దర్శనం

  • ఉగాది నుంచి దుర్గగుడిలో అమలు

ఆంధ్రజ్యోతి, విజయవాడ: కనకదుర్గమ్మను అంతరాలయం నుంచి దర్శించుకోవాలనుకునే భక్తులు ఇకపై సంప్రదాయ దుస్తుల్లోనే రావాలి. పురుషులు పంచె, చొక్కా, కండువా, మహిళలు చీర, జాకెట్టు ధరించాలి. చుడీదార్లు, పంజాబీ డ్రెస్సుల్లో వచ్చే మహిళలు చున్నీ వేసుకోవాలి. ఉగాది నుంచి ఈ నిబంధన అమలు చేయనున్నట్టు దేవస్థానం అధికారులు తెలిపారు. ఈ నిబంధన తెలియక వచ్చే భక్తులు..  అప్పటికప్పుడు వాటిని కొనుక్కునేందుకు వీలుగా దేవస్థానంలోని ఆర్జిత సేవ కౌంటర్‌లో సంప్రదాయ దుస్తులను అమ్మకానికి ఉంచుతున్నారు. చీర లేదా చున్నీ రూ. 100, పంచె, కండువాలను రూ.150లకు విక్రయించాలని నిర్ణయించారు.

Updated Date - 2020-03-18T09:50:41+05:30 IST