విజయవాడలో నాన్‌వెజ్‌పై నిషేధం

ABN , First Publish Date - 2020-04-25T22:53:21+05:30 IST

నగరంలో కరోనా పాజిటీవ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆంక్షలు మరింత కఠినతరం చేశారు. నగర వ్యాప్తంగా నాన్‌వెజ్ అమ్మకాలను నిషేధించారు.

విజయవాడలో నాన్‌వెజ్‌పై నిషేధం

విజయవాడ: నగరంలో కరోనా పాజిటీవ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆంక్షలు మరింత కఠినతరం చేశారు. నగర వ్యాప్తంగా నాన్‌వెజ్ అమ్మకాలను నిషేధించారు. చికెన్, మటన్, ఫిష్ వంటి మాంసాహార విక్రయాలను పూర్తిగా నిషేధించారు. ఈ మేరకు జిల్లా అధికారయంత్రాంగం ప్రకటన విడుదల చేసింది. ఎవరైనా రహస్యంగా అమ్మకాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. క్రయ విక్రయాలకు సంబంధించి నిషేధంపై మైక్స్ ద్వారా అన్ని డివిజిన్లలో విస్తృత ప్రచారం చేస్తున్నారు. ప్రజలు, వ్యాపారులందరూ వీటిని కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

Updated Date - 2020-04-25T22:53:21+05:30 IST