-
-
Home » Andhra Pradesh » vijayawada complete lock down collector order
-
26 నుండి విజయవాడలో కంప్లీట్ లాక్‌డౌన్
ABN , First Publish Date - 2020-06-24T03:14:52+05:30 IST
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. విజయవాడలో ఈ నెల 26 నుంచి వారం రోజుల పాటు పూర్తిస్థాయిలో లాక్‌డౌన్ విధించనున్నారు.

కృష్ణా: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. విజయవాడలో ఈ నెల 26 నుంచి వారం రోజుల పాటు పూర్తిస్థాయిలో లాక్‌డౌన్ విధించనున్నారు. ఇదే విషయాన్ని కలెక్టర్ ప్రకటించారు. 24, 25 తేదీల్లోపే నిత్యావసర సరుకులను భద్రపరుచుకోవాలని ప్రజలకు కలెక్టర్ సూచించారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకే లాక్‌డౌన్ విధిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. మెడికల్ షాప్స్‌కు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. ప్రజలెవరూ వారం రోజులపాటు బయటకు రాకూడదని ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు కూడా వారం రోజులపాటు లాక్‌డౌన్‌ను పాటించాలని ఆదేశించారు.
కాగా, కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాలల్లోనూ లాక్‌డౌన్ విధిస్తామని కలెక్టర్ తెలిపారు. రూరల్ ప్రాంతాల్లోని నాన్ కంటైన్మెంట్ జోన్లలో పరిమిత సమయం వరకు మాత్రమే నిత్యావసర వస్తువుల విక్రయాలకు అనుమతిస్తామని చెప్పారు. కరోనా కేసులు తగ్గుముఖం పడితే వారం రోజుల తరువాత లాక్‌డౌన్ పొడిగింపుపై తదుపరి ఆదేశాలు జారీ చేస్తామన్నారు.