విజయవాడలో బీజేపీ రెండవ వర్చువల్ ర్యాలీ

ABN , First Publish Date - 2020-06-18T15:59:49+05:30 IST

విజయవాడలో బీజేపీ రెండవ వర్చువల్ ర్యాలీ

విజయవాడలో బీజేపీ రెండవ వర్చువల్ ర్యాలీ

విజయవాడ: భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ రెండవ వర్చువల్ ర్యాలీ, బహిరంగ సభ నగరంలో జరుగనుంది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్చవల్ ర్యాలీ జరుగనుంది. బీజేపీ జాతీయ నాయకులు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చాక  మొదటి సంవత్సరం అభివృద్ధిని ప్రజలకు తెలియజేయడంతో పాటు ఏపీకి ఏం చేశామో కిషన్‌రెడ్డి వివరించనున్నారు. ఢిల్లీ నుంచి కిషన్ రెడ్డి, జీవీఎల్ ర్యాలీలో పాల్గొననుండగా... విజయవాడ నుంచి బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నాతో పాటు అఖిల భారత బీజేపీ కార్యదర్శి సత్య కుమార్, అఖిల భారత కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్‌చార్జ్ సునిల్ దియోదర్, నెహ్రూ యువ కేంద్ర నేషనల్ వైస్ చైర్మన్ ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి ఇతర ముఖ్య నేతలు ర్యాలీలో పాల్గొననున్నారు. 

Updated Date - 2020-06-18T15:59:49+05:30 IST