విజయవాడలో క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు

ABN , First Publish Date - 2020-09-20T19:20:37+05:30 IST

బెజవాడ కేంద్రంగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా గుట్టు పోలీసులు రట్టు చేశారు.

విజయవాడలో క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు

విజయవాడ: బెజవాడ కేంద్రంగా క్రికెట్  బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఆన్‌లైన్‌లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మ్యాచ్‌‌పై ముఠా సభ్యులు భారీగా బెట్టింగ్‌లు నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ముఠా సభ్యులు బెజవాడలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని మరీ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఆన్‌లైన్ సెటప్‌ను స్వాధీనం చేసుకున్నారు. మరికాసేపట్లో పోలీసులు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. 


డీసీపీ హర్షవర్ధన్ మాట్లాడుతూ...మొగల్రాజపురంలో ఆచార్య ప్లే స్కూలులో క్రికెట్ బెట్టింగ్ జరుగుతున్నట్టు తెలిసిందని.. బెట్టింగ్ ఎక్విప్మెంట్ మొత్తం స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అవతార్ అనే యాప్ ద్వారా ఈ బెట్టింగ్ నడిపిస్తున్నారన్నారు. బాగా తెలిసిన వాళ్ళ ద్వారానే ఈ బెట్టింగ్ యాప్‌లో ఆడతారని ఆయన చెప్పారు. రూ.12 లక్షల వరకు బెట్టింగ్ జరుగుతోందని సమాచారం వచ్చిందని అన్నారు. ప్రధాన సూత్రధారి నవీన్‌ను త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని తెలిపారు. ఐపీఎల్ రోజుల్లో పోలీసులకు బెట్టింగ్‌పై సమాచారం ఇచ్చి ప్రజలు సహకరించాలని కోరారు. ఈ వ్యాలెట్ ద్వారా నగదు వ్యవహారాలు చేస్తున్నారని.. విద్యార్ధులు ఇలాంటి బెట్టింగ్‌లకు ఆకర్షితులు కావద్దని డీసీపీ హర్షవర్ధన్ కోరారు. 

Updated Date - 2020-09-20T19:20:37+05:30 IST