సిద్ధార్థ కాలేజ్ పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ ఇంతియాజ్
ABN , First Publish Date - 2020-09-20T18:34:36+05:30 IST
గ్రామ, వార్డు సచివాల పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో సిద్ధార్థ కాలేజ్ పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ఆహ్మద్ పరిశీలించారు.

విజయవాడ: గ్రామ, వార్డు సచివాల పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో సిద్ధార్థ కాలేజ్ పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ఆహ్మద్ పరిశీలించారు. గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలకు 266 కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. తొలి రోజు 258 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయని... జిల్లాలో లక్షా 19వేల మంది పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేశామన్నారు. జిల్లాలో 5 మంది కోవిడ్ పెషెంట్స్ పరీక్ష రాస్తున్నారని తెలిపారు. 26వ వరకు పరీక్షలు జరగనున్నాయని... పరీక్షా కేంద్రాల వద్దకు అభ్యర్థులు రెండు గంటల ముందే చేరుకోవాలని కలెక్టర్ ఇంతియాజ్ వెల్లడించారు.