జగన్... సీపీఎస్ రద్దు చేసి మాట‌ నిలబెట్టుకోవాలి: బాబురెడ్డి

ABN , First Publish Date - 2020-09-01T17:08:13+05:30 IST

సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలంటూ యూటీఎఫ్ నేతలు మంగళవారం ఆందోళనకు దిగారు. ధర్నా చౌక్‌లో అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవడంతో

జగన్... సీపీఎస్ రద్దు చేసి మాట‌ నిలబెట్టుకోవాలి: బాబురెడ్డి

విజయవాడ: సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలంటూ యూటీఎఫ్ నేతలు మంగళవారం ఆందోళనకు దిగారు. ధర్నా చౌక్‌లో అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవడంతో యూటీఎఫ్ కార్యాలయంలోనే ఉపాధ్యాయ సంఘాల నేతలు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాబురెడ్డి మాట్లాడూ సీపీఎస్ విధానం రద్దు చేస్తామన్న సీఎం మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. నెల రోజుల్లో రద్దు చేస్తామని చెప్పి ఓట్లు వేయించుకున్నారని... జూన్ 8న కూడా సీఎం స్వయంగా చెప్పారని గుర్తుచేశారు. నిన్న కొన్ని సంఘాలతో సమావేశం పెట్టుకుని మేలు చేస్తామని అంటున్నారని తెలిపారు. అయితే మేలు చేస్తామనడం కాదని.. సీపీఎస్ రద్దు చేసి, పాత పెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. మాట తప్పను, మడమ తిప్పను అన్న జగన్... మాట తప్పి మోసం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 15 నెలలు అయినా ఇచ్చిన మాట జగన్ ఎందుకు నిలబెట్టుకోలేదని ప్రశ్నించారు. భగవద్గీత, ఖురాన్, బైబిల్ అన్న  జగన్.. ప్రమాణాలన్నీ అసత్యాలే అని విమర్శించారు. ప్రజా సమస్యలపై పోరాటం చేయకుండా కరోనా ఆంక్షలతో అడ్డుకుంటున్నారన్నారు. గాంధేయ మార్గంలో సత్యాగ్రహం చేస్తామన్నా ..‌ అనుమతి ఇవ్వలేదని తెలిపారు. జగన్ మొండి‌ వైఖరి విడనాడి సీపీఎస్ రద్దు చేసి మాట‌ నిలబెట్టుకోవాలని బాబు రెడ్డి డిమాండ్ చేశారు. 


Updated Date - 2020-09-01T17:08:13+05:30 IST