విజయవాడ: మహిళలను అసభ్యరీతిలో దూషించిన ప్రభుత్వ ఉద్యోగి

ABN , First Publish Date - 2020-08-20T16:20:38+05:30 IST

తిన్న భోజనానికీ డబ్బులు అడిగినందుకు హోటల్‌లో మహిళల పట్ల ప్రభుత్వ ఉద్యోగి అసభ్య రీతిలో ప్రవర్తించాడు.

విజయవాడ: మహిళలను అసభ్యరీతిలో దూషించిన ప్రభుత్వ ఉద్యోగి

విజయవాడ: తిన్న భోజనానికీ డబ్బులు అడిగినందుకు హోటల్‌లో మహిళల పట్ల ప్రభుత్వ ఉద్యోగి అసభ్య రీతిలో ప్రవర్తించాడు. దీంతో పాత ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేస్తున్న సీనియర్ అసిస్టెంట్ హోచ్ మెన్‌ ఓ హోటల్‌లో భోజనం చేయగా...అందుకు మహిళలు డబ్బులు అడిగారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ప్రభుత్వ ఉద్యోగి మహిళలను ఫోటోలు తీస్తూ బెదిరింపులకు పాల్పడ్డాడు. తీసిన ఫోటోలు అంతర్జాలంలో పెట్టి మీ బతుకులు నాశనం చేస్తా అంటూ వేధింపులకు దిగాడు. తిన్న భోజనానికీ కాదు కావాలంటే.. మీకు ఇస్తా డబ్బులు వస్తారా అంటూ మహిళల పట్ల అసభ్య పాదజాలంతో దూషించాడు. దీంతో ప్రభుత్వ ఉద్యోగిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 


Updated Date - 2020-08-20T16:20:38+05:30 IST