క్రీస్తురాజ్ పురంలో విరిగిపడ్డ కొండచరియ

ABN , First Publish Date - 2020-07-21T04:07:00+05:30 IST

నగరంలోని క్రీస్తురాజ్ పురంలో కొండచరియలు విరిగిపడ్డాయి. వర్షం కారణంగానే కొండ చరియలు విరిగిపడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో నాలుగు ఇళ్లు ధ్వంసం అయ్యాయి.

క్రీస్తురాజ్ పురంలో విరిగిపడ్డ కొండచరియ

విజయవాడ: నగరంలోని క్రీస్తురాజ్ పురంలో కొండచరియలు విరిగిపడ్డాయి. వర్షం కారణంగానే కొండ చరియలు విరిగిపడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో నాలుగు ఇళ్లు ధ్వంసం అయ్యాయి. కాగా, సమయానికి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే భారీగా ఆస్తి నష్టం వాటిళ్లింది. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

Updated Date - 2020-07-21T04:07:00+05:30 IST