-
-
Home » Andhra Pradesh » Vijayasayireddy
-
మంత్రి కోసం.. నేనే కారు దిగా: విజయసాయి
ABN , First Publish Date - 2020-05-13T09:44:36+05:30 IST
‘‘విశాఖ ఎల్జీ పాలిమర్స్‌లో ప్రమాదం జరిగిన వెంటనే సీఎం విశాఖ వచ్చేందుకు విజయవాడలోని నివాసం నుంచి ఎయిర్‌పోర్టుకు కారులో బయలుదేరారు.

విశాఖపట్నం, మే 12(ఆంధ్రజ్యోతి): ‘‘విశాఖ ఎల్జీ పాలిమర్స్‌లో ప్రమాదం జరిగిన వెంటనే సీఎం విశాఖ వచ్చేందుకు విజయవాడలోని నివాసం నుంచి ఎయిర్‌పోర్టుకు కారులో బయలుదేరారు. ముందు కారెక్కిన నేను తరువాత దిగిపోయిన మాట నిజమే. పరామర్శ సమయంలో ఆరోగ్య శాఖ మంత్రి ఉంటే బాధితులకు న్యాయం జరుగుతుందని భావించా. దీంతో నేనే కారు దిగి మంత్రిని ఎక్కాలని కోరాను. దీనిని ప్రతిపక్షాలు చిలువలుపలువలుగా చిత్రీకరించాయి’’ అని విజయసాయిరెడ్డి విమర్శించారు.