చంద్రబాబుకు అసలు తొత్తు విజయసాయే : దినకర్

ABN , First Publish Date - 2020-07-20T17:24:28+05:30 IST

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

చంద్రబాబుకు అసలు తొత్తు విజయసాయే : దినకర్

అమరాతి : టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అసలు తొత్తు అని బీజేపీ నేత లంకదినకర్ వ్యాఖ్యానించారు. గత కొన్నిరోజులుగా ఏపీలో బీజేపీ-వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నెలకొన్న సంగతి తెలిసిందే. బీజేపీ నేతల వ్యాఖ్యలపై విజయసాయి కౌంటర్లిస్తుండటంతో.. సోషల్ మీడియా వేదికగా కమలనాథులు స్పందిస్తూ కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు. తాజాగా.. ట్విట్టర్‌లో ఎంపీ విజయసాయి-లంకా దినకర్ మధ్య ట్వీట్ల వార్ జరిగింది. అసలు వీరిద్దరి మధ్య వార్‌కు దారితీసిన పరిస్థితులేంటి..? అనేది ఇప్పుడు చూద్దాం.


ఈ ముసుగు ఇంకెన్నాళ్లు?

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబు కోవర్టని మళ్లీ అర్థమైంది. సొంత పార్టీ అభిప్రాయానికి భిన్నంగా చంద్రబాబుకు అనుకూలంగా రాజధాని బిల్లును ఆమోదించొద్దని గవర్నర్‌కు లేఖ రాశాడు. ఈ ముసుగు ఇంకెన్నాళ్లు?అని విజయసాయిరెడ్డి దుమారం రేపే ట్వీట్ చేశారు.


అసలు తొత్తు మీరే..

ఈ ట్వీట్‌కు లంకా దినకర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కొన్ని జీవితాలకు ఎప్పటికీ బుద్ధిరాదు. ఎంపీ రఘురామరాజు ఏదోఒకటి మాట్లాడినప్పుడల్లా ఈయన ఏదో వేషం వేస్తుంటాడు.. అందులో ఈ రోజు అమావాస్య కొంత అసలు వేషం బయటకు వచ్చింది. అసలు చంద్రబాబు తొత్తు ఆయనే.. జగన్‌పై కక్షపట్టి పిచ్చి సలహాలిస్తూ చెడ్డపేరు తెస్తున్నాడుఅని లంకా దినకర్ స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. దీంతో ఈ ఇద్దరి మధ్య ట్విట్టర్ వేదికగా వివాదం ముదిరింది. మరోవైపు వైసీపీ నేతలు, కార్యకర్తలు దినకర్‌పై సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.


Updated Date - 2020-07-20T17:24:28+05:30 IST