డాక్టర్ సుధాకర్ ఘటనపై తీవ్రంగా స్పందించిన విజయసాయి

ABN , First Publish Date - 2020-05-17T21:44:21+05:30 IST

డాక్టర్ సుధాకర్ ఘటనపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. చంద్రబాబును దూషిస్తూనే.. సుధాకర్ తీరుపై పరోక్ష విమర్శలు చేశారు. ‘బాబు వాడకం ఎలా ఉంటుందంటే..

డాక్టర్ సుధాకర్ ఘటనపై తీవ్రంగా స్పందించిన విజయసాయి

విశాఖపట్నం: డాక్టర్ సుధాకర్ ఘటనపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. చంద్రబాబును దూషిస్తూనే.. సుధాకర్ తీరుపై పరోక్ష విమర్శలు చేశారు. ‘బాబు వాడకం ఎలా ఉంటుందంటే.. జీవితకాలంలో వాళ్లు చదివిన చదువు, సంపాదించుకున్న గుర్తింపు అంతా గంగలో కలిసిపోతుంది’ అని ట్విట్టర్ వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ’ఎల్లో వైరస్ ప్రభావంతో వైజాగ్‌లో మత్తు డాక్టర్ చేసిన వీరంగం చూస్తే.. అర్థం కావడం లేదా తరువాత ఎవరని?. అయ్యో అంత అన్యాయం జరిగిందా? అని ఒక ప్రెస్‌ నోటు రిలీజ్ అవుతుంది’ అని విజయసాయిరెడ్డి తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Updated Date - 2020-05-17T21:44:21+05:30 IST