ఎన్నికల కమిషనర్‌పై విజయసాయి అభ్యంతరకర వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2020-03-16T00:08:23+05:30 IST

ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌పై ఎంపీ విజయసాయిరెడ్డి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. కరోనా కంటే అత్యంత ప్రమాదకారి నిమ్మగడ్డ రమేష్‌ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఎన్నికల కమిషనర్‌పై విజయసాయి అభ్యంతరకర వ్యాఖ్యలు

అమరావతి: ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌పై ఎంపీ విజయసాయిరెడ్డి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. కరోనా కంటే అత్యంత ప్రమాదకారి నిమ్మగడ్డ రమేష్‌ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నిమ్మగడ్డ రమేష్‌ కాదని, నారావారి రమేష్‌ అంటూ విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శునకాన్ని కనకపు సింహాసనం మీద కూర్చోబెడితే ఏం చేస్తుందో.. నిమ్మగడ్డ రమేష్‌ ఎన్నికల కమిషనర్‌గా అదే పనిచేస్తున్నారని తప్పుబట్టారు. ప్రభుత్వంలో ఎవరినీ సంప్రదించకుండా.. అభిప్రాయాలు తీసుకోకుండా.. నిమ్మగడ్డ ఎన్నికలు వాయిదా వేశారని ఆయన మండిపడ్డారు. రమేష్‌ దృష్టిలో టీడీపీ ఒక్కటే రాజకీయపార్టీనా.. వైసీపీ కాదా? అని ప్రశ్నించారు. టీడీపీ అధినేత చంద్రబాబు అజెండా ప్రకారం కులపిచ్చివాడిగా.. ఎల్లో సూసైడ్ స్క్వాడ్ మెంబర్‌గా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిమ్మగడ్డ రమేష్‌ సిగ్గుంటే నైతిక విలువలుంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నిమ్మగడ్డ రమేష్‌ను.. నారా వారి గబ్బిలం అని పిలిస్తే బాగుంటుందని విజయసాయి అన్నారు.

Updated Date - 2020-03-16T00:08:23+05:30 IST