విజయనగరంలో రేపటి నుంచి లాక్‌డౌన్

ABN , First Publish Date - 2020-07-16T01:47:56+05:30 IST

జిల్లాలో రేపటి నుంచి పూర్తిస్థాయి లాక్‌డౌన్ అమలు కానుంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ హరిజవహర్ లాల్ ఉత్తర్వులు జారీ చేశారు. లాక్‌డౌన్ నిబంధనల ప్రకారం.. గురువారం ఉదయం 6 గంటల

విజయనగరంలో రేపటి నుంచి లాక్‌డౌన్

విజయనగరం: జిల్లాలో రేపటి నుంచి పూర్తిస్థాయి లాక్‌డౌన్ అమలు కానుంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ హరిజవహర్ లాల్ ఉత్తర్వులు జారీ చేశారు. లాక్‌డౌన్ నిబంధనల ప్రకారం.. గురువారం ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు నిత్యావసరాలు, మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చారు. మెడికల్ షాపులు, ఆస్పత్రులు యధాతధంగా కొనసాగుతాయి. దేవాలయాలు, ప్రార్థనా స్థలాలకు అనుమతి నిరాకరించారు. అలాగే వివాహాలకు 50 మందికి, అంత్యక్రియలకు 20 మందికి మాత్రమే అనుమతించారు. జిల్లాలోని పార్వతీపురం, సాలూరు, బొబ్బిలి, పురపాలక సంఘాలతో పాటు విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలో గురువారం నుండి ఈనెల 21వ తేదీ వరకు లాక్‌డౌన్ ఆంక్షలు కొనసాగనున్నాయి.

Updated Date - 2020-07-16T01:47:56+05:30 IST