తెలుగు ప్రజలకు జగన్ విజయదశమి శుభాకాంక్షలు
ABN , First Publish Date - 2020-10-24T16:19:03+05:30 IST
తెలుగు ప్రజలందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దసరా శుభాకాంక్షలు తెలిపారు.

అమరావతి : తెలుగు ప్రజలందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఇందుకు సంబంధించి శనివారం నాడు సీఎంవో ఓ ప్రకటన విడుదల చేసింది. ‘చెడుపై మంచి, దుష్ట శక్తుల మీద దైవ శక్తులు సాధించిన విజయానికి గుర్తుగా దసరా పండుగ జరుపుకుంటున్నాం.చెడు ఎంత దుర్మార్గమైనదైనా, ఎంత శక్తిమంతమైనదైనా అంతిమ విజయం మంచినే వరిస్తుందని మహిషాసురుడిపై జగన్మాత సాధించిన విజయం ప్రపంచానికి చాటింది. జగన్మాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖ శాంతులతో, సిరి సంపదలతో తులతూగాలని, ప్రతి ఒక్క కుటుంబానికి విజయాలు వరించేలా దుర్గామాత దీవించాలని కోరుకుంటూన్నాను’ అని వైఎస్ జగన్ తెలిపారు.