-
-
Home » Andhra Pradesh » Vijay kumar comments on Jagan
-
రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోంది: విజయ్ కుమార్
ABN , First Publish Date - 2020-06-22T19:08:15+05:30 IST
విశాఖ: రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగ అమలు కావడం లేదని.. జగన్ తాత రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోందని జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు పుచ్చా విజయ్ కుమార్ విమర్శించారు.

విశాఖ: రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగ అమలు కావడం లేదని.. జగన్ తాత రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోందని జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు పుచ్చా విజయ్ కుమార్ విమర్శించారు. దళితుల ఓట్లతో గెలిచి దళితులనే టార్గెట్ చేశారన్నారు. జగన్ దళిత ద్రోహిగా చరిత్రలో మిగిలి పోతారన్నారు. పిల్లలు చదువుకున్న పుస్తకాలపై జగన్ ఫోటోలను ప్రచురిస్తారా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో రౌడీ పాలన తీసుకువచ్చి.. బీసీలను కూడా టార్గెట్ చేశారన్నారు. అయ్యన్న పాత్రుడు మీద 7 కేసులు పెట్టారని... ప్రశ్నిస్తే కేసులు పెడతారా? అని ప్రశ్నించారు. నవరత్నాల పేరిట దళితులకు ఒక్క పథకం ఏమైనా పెట్టారా? అని ప్రశ్నించారు. టీడీపీని లేకుండా చేయడం మీ తరం కాదని విజయ్ కుమార్ పేర్కొన్నారు.