నంబూరు క్వారంటైన్ సెంటర్‌లో బాధితుల ఆందోళన

ABN , First Publish Date - 2020-04-15T20:38:57+05:30 IST

నంబూరు వీవీఐటీ కాలేజీ క్వారంటైన్ సెంటర్‌లో

నంబూరు క్వారంటైన్ సెంటర్‌లో బాధితుల ఆందోళన

గుంటూరు జిల్లా: నంబూరు వీవీఐటీ కాలేజీ క్వారంటైన్ సెంటర్‌లో ఉంచిన కరోనా అనుమానిత బాధితులు ఆందోళనకు దిగారు. కరోనా పాజిటీవ్‌గా తేలినవారిని కూడా తమతో ఉంచారని వైరస్ అనుమానిత వ్యక్తులు ఆందోళనకు దిగారు. దీనివల్ల తమకు కూడా పాజిటీవ్ వచ్చే ప్రమాదం ఉందన్నారు. కనీసం ఫౌష్టిక ఆహారం కూడా ఇవ్వడంలేదని, అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గుంటూరు జిల్లాలోనే కరోనా పాజిటీవ్ కేసులు అత్యధికంగా నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు అధికారిక లెక్కల ప్రకారం 114 కేసులు నమోదు కాగా... ఐదుగురు మృతి చెందారు. ఇంకా మూడు వందలమంది ఫలితాలు రావాల్సి ఉంది. ప్రారంభంలో రోజుకు ఒకటి, రెండుకే పరిమితమైన జిల్లాలో రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోనే సుమారు 90 కేసులు నమోదయినట్లు తెలియవచ్చింది. 

Updated Date - 2020-04-15T20:38:57+05:30 IST