వెంకటగిరి పోలేరమ్మ జాతరకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

ABN , First Publish Date - 2020-09-06T16:21:31+05:30 IST

దక్షిణ భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధిగాంచిన వెంకటగిరి శక్తి స్వరూపిణి పోలేరమ్మ అమ్మవారి జాతర నిర్వహణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు జాతర నిర్వహణకు అనుమతి ఇస్తూ

వెంకటగిరి పోలేరమ్మ జాతరకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

నెల్లూరు: దక్షిణ భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధిగాంచిన వెంకటగిరి శక్తి స్వరూపిణి పోలేరమ్మ అమ్మవారి జాతర నిర్వహణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు జాతర నిర్వహణకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కోవిడ్ -19 నిబంధనలకు అనుగుణంగా జాతర నిర్వహించుకోవాలని సూచించింది. 9, 10 తేదీలలో భక్తుల దర్శనాలకు అనుమతి లేకుండా, అమ్మవారికి జరగాల్సిన సంప్రదాయ కైంకర్యాలు నిర్వహించాలంది. అమ్మవారి సేవకులతో, అధికారుల మధ్య జాతర నిర్వహించేలా దేవాదాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది.

Updated Date - 2020-09-06T16:21:31+05:30 IST