నేటి నుంచి రోడ్డుపైకి వస్తే వాహనాలు సీజ్‌

ABN , First Publish Date - 2020-03-24T12:32:56+05:30 IST

నేటి నుంచి రోడ్డుపైకి వస్తే వాహనాలు సీజ్‌

నేటి నుంచి రోడ్డుపైకి వస్తే వాహనాలు సీజ్‌

విశాఖపట్నం(ఆంధ్రజ్యోతి): నగరంలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను కచ్చితంగా అమలు చేయాలని పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించారు. మంగళవారం నుంచి ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు ఎట్టి పరిస్థితుల్లోను రోడ్ల పైకి రాకూడదని, అలా వస్తే వాహనాన్ని సీజ్‌ చేయాలని నిర్ణయించారు. నిత్యవసరాలు కొనుగోలు చేయడానికి ఎవరైనా బయటకు వస్తే మూడు కిలోమీటర్లకు మించి తిరగకూడదనే నిబంధన పెట్టారు. అదే వాహనం పదే పదే తిరిగితే మాత్రం స్వాధీనం చేసుకొని, కరోనా వైరస్‌ తగ్గిన తరువాతే ఇస్తామని అధికారులు పేర్కొన్నారు. మార్చి 31 వరకు అంతా ఇళ్లకే పరిమితం కావాలని, దీనిని కచ్చితంగా అమలు చేయాలని పోలీస్‌ కమిషనర్‌ ఆర్‌కే మీనా సూచించారు. 

Read more