సెప్టెంబరు 30 వరకు వాహనాల పన్ను చెల్లింపు గడువు

ABN , First Publish Date - 2020-08-01T11:50:21+05:30 IST

సెప్టెంబరు 30 వరకు వాహనాల పన్ను చెల్లింపు గడువు

సెప్టెంబరు 30 వరకు వాహనాల పన్ను చెల్లింపు గడువు

(ఆంధ్రజ్యోతి, విజయవాడ): రవాణా వాహనాల పన్ను చెల్లింపు గడువును సెప్టెంబర్‌ 30 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం మచిలీపట్నంలో మంత్రి నానిని లారీ, ట్రాలీ యజమానుల సంఘాల నేతలు వైవీ ఈశ్వరరావు, ఎస్‌.సురే ష్‌ , కేవీ రామారావు కలిసి కరోనా వేళ రవాణా రంగ ఇబ్బందులు, సాధక బాధకాలను వివరించారు. పన్ను చెల్లింపు గడువు పెంపుదలకు సంబంధించిన ఫైలు ఇంకా పెండింగ్‌లో ఉందని, సమస్యను సత్వరం పరిష్కరించి వెసులుబాటు కల్పించాల్సిందిగా కోరారు. స్పందించిన మంత్రి అధికారులతో మాట్లాడి గడువును పెంచుతూ జీవోను జారీ చేయించారు.

Updated Date - 2020-08-01T11:50:21+05:30 IST