జగన్ అంకెల గారడి చేస్తున్నారు: వాసుపల్లి గణేష్
ABN , First Publish Date - 2020-07-18T19:03:13+05:30 IST
విశాఖ: ముఖ్యమంత్రి జగన్ మాయమాటలు చెబుతూ అంకెల గారడి చేస్తున్నారని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పేర్కొన్నారు.

విశాఖ: ముఖ్యమంత్రి జగన్ మాయమాటలు చెబుతూ అంకెల గారడి చేస్తున్నారని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో ప్రవేశ పెట్టిన పథకాలు నామరూపాల్లేకుండా చేశాయన్నారు. కేవలం నవరత్నాలు ప్రాధాన్యతకే ఇస్తున్నారన్నారు. అభివృద్ధి చేస్తారని కోటి ఆశలతో ముస్లింలు జగన్‌ను గెలిపిస్తే వారికి మొండి చేయి చూపిస్తున్నారన్నారు.
ముస్లింలు ఉద్యోగాలలో వెనుకబడి ఉన్నారని గణేష్ కుమార్ పేర్కొన్నారు. గతంలో చంద్రబాబు ముస్లింల అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టారన్నారు. ముస్లిం పెళ్లి కానుకకు తూట్లు పొడిచారన్నారు. టీడీపీ ప్రభుత్వంలో ప్రతి ఏటా 10 లక్షల మందికి రంజాన్ తోఫాను ఇచ్చామని వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వ అధికారం సంవత్సరం అవుతున్న ముస్లింలకు ఏం చేశారో చెప్పాలన్నారు.
ముస్లింలపై జగన్మోహన్ రెడ్డి సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని గణేష్ కుమార్ విమర్శించారు.