అమరావతిని తరలించే శక్తి జగన్‌కు లేదు: వర్లరామయ్య
ABN , First Publish Date - 2020-12-08T00:01:15+05:30 IST
దేశ చరిత్రలో అత్యంత అవినీతి ముఖ్యమంత్రి జగన్ అని టీడీపీ సీనియర్ నాయకుడు వర్లరామయ్య ఆరోపించారు.

అమరావతి: అమరావతిని తరలించే శక్తి జగన్‌కు లేదని.. మూడు రాజధానులను ప్రకటించడం జగన్ తెలివి తక్కువ నిర్ణయమని టీడీపీ సీనియర్ నాయకుడు వర్లరామయ్య విమర్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమరావతి రాజధానిగా ఉండాలని రైతులు 356 రోజులుగా ధర్నా చేస్తున్న పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎంలు మారినప్పుడల్లా రాజధానులు మార్చడం మూర్ఖత్వం అవుతుందని దుయ్యబట్టారు. జగన్ అనాలోచిత నిర్ణయాలతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడతున్నారన్నారు.
జగన్ అత్యంత అవినీతి పరుడు
దేశ చరిత్రలో అత్యంత అవినీతి ముఖ్యమంత్రి జగన్ అని ఆరోపించారు. జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పదవిని అడ్డుపెట్టుకుని కోట్లు సంపాదించారని విమర్షించారు. 2004కి ముందు జగన్ ఆస్తి ఎంత?.. ఇప్పుడు ఎంత? ఉందని ప్రశ్నించారు. అధికారం శాశ్వతం కాదని జగన్ గుర్తుపెట్టుకోవాలని చెప్పారు. జగన్ హయాంలో రాష్ట్రం అప్పుల పాలయిందని విమర్షించారు. తుపాన్లతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని రైతు సంక్షేమాన్ని ప్రభుత్వం గాలికొదిలేసిందని ఆరోపించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు.