ప్రశ్నిస్తున్న దళితులపై దాడులు చేస్తున్నారు: వర్ల రామయ్య

ABN , First Publish Date - 2020-06-01T16:24:03+05:30 IST

అమరావతి: ప్రశ్నిస్తున్న దళితులపై దాడులకు తెగబడుతున్నారని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య పేర్కొన్నారు.

ప్రశ్నిస్తున్న దళితులపై దాడులు చేస్తున్నారు: వర్ల రామయ్య

అమరావతి: ప్రశ్నిస్తున్న దళితులపై దాడులకు తెగబడుతున్నారని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఎన్‌హెచ్‌ఆర్సీకి లేఖ రాశారు. ఏపీలో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందన్నారు. ప్రశ్నిస్తున్న దళితులపై దాడులు చేస్తున్నారన్నారు. మాస్క్‌ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్‌పై పిచ్చోడనే ముద్ర వేశారన్నారు. సుధాకర్‌కు సరైన వైద్యం అందించకుండా హింసిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. ఎన్‌హెచ్‌ఆర్సీ వెంటనే స్పందించి సుధాకర్‌కు న్యాయం చేయాలని వర్ల రామయ్య కోరారు.


Updated Date - 2020-06-01T16:24:03+05:30 IST