జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు వర్లరామయ్య లేఖ

ABN , First Publish Date - 2020-10-03T15:29:25+05:30 IST

అమరావతి: జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు టీడీపీ సీనియర్ నేత వర్లరామయ్య లేఖ రాశారు.

జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు వర్లరామయ్య లేఖ

అమరావతి: జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు టీడీపీ సీనియర్ నేత వర్లరామయ్య లేఖ రాశారు. రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్-19(1)(ఏ) ద్వారా సంక్రమించిన..భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పూర్తిగా హరించబడిందన్నారు. దళితులపై వరుసగా దాడులు జరుగుతున్నా.. వాటిని అరికట్టడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ఒక దళిత కుటుంబాన్ని సజీవదహనం చేయడానికి ప్రయత్నించినా.. ఈ ప్రభుత్వంలో చలనం రాలేదన్నారు. దళిత యువకుడికి పీఎస్‌లో శిరోముండనం జరిగినా.. అసలు ముద్దాయిలు అరెస్ట్‌ కాలేదన్నారు. ప్రత్యేక కమిటీతో దర్యాప్తు జరిపించాలని  వర్ల రామయ్య లేఖలో కోరారు. 

Updated Date - 2020-10-03T15:29:25+05:30 IST