ఇంకొంచెం కఠినంగా వ్యవహరించినా ఫర్వాలేదు: వర్ల రామయ్య

ABN , First Publish Date - 2020-03-25T16:02:52+05:30 IST

అమరావతి: ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో రోడ్లపై తిరిగే అవగాహనా రాహిత్యుల పట్ల పోలీసులు ఇంకొంచెం కఠినంగా వ్యవహరించినా ఫరవాలేదని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య పేర్కొన్నారు.

ఇంకొంచెం కఠినంగా వ్యవహరించినా ఫర్వాలేదు: వర్ల రామయ్య

అమరావతి: ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో రోడ్లపై తిరిగే అవగాహనా రాహిత్యుల పట్ల పోలీసులు ఇంకొంచెం కఠినంగా వ్యవహరించినా ఫరవాలేదని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య పేర్కొన్నారు. పది మంది మేలు కోసం ఒక్కరిని ఇబ్బంది పెట్టినా అది ఆమోద యోగ్యమేనన్నారు. ప్రపంచదేశాలు పాటిస్తున్న లాక్‌డౌన్‌ను మనమెందుకు పాటించమని ప్రశ్నించారు. మన కోసమే కదా?... సహకరిద్దాం.. కరోనా మహమ్మారిని తరిమికొడదామని వర్ల రామయ్య పిలుపునిచ్చారు. 


Read more