డా. సుధాకర్‌పై వైసీపీ ప్రభుత్వం కుట్ర పన్నింది: వర్ల

ABN , First Publish Date - 2020-06-06T23:33:05+05:30 IST

డాక్టర్‌ సుధాకర్‌పై వైసీపీ ప్రభుత్వం కుట్ర పన్నిందని

డా. సుధాకర్‌పై వైసీపీ ప్రభుత్వం కుట్ర పన్నింది: వర్ల

అమరావతి : డాక్టర్‌ సుధాకర్‌పై వైసీపీ ప్రభుత్వం కుట్ర పన్నిందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు, సీనియర్ నేత వర్లరామయ్య వ్యాఖ్యానించారు. శనివారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. దళితుల ప్రాథమిక హక్కుల్ని సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి ఇనుప పాదాలతో తొక్కివేస్తున్నారని ఆరోపించారు. సుధాకర్‌ కేసులో అన్ని వేళ్లు జగన్‌ క్యాంప్‌ ఆఫీసు వైపే చూపిస్తున్నాయన్నారు. సుధాకర్‌ కేసుతో దళిత జాతి వైసీపీకి దూరమైందని చెప్పుకొచ్చారు. అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్‌, ఏపీలో డాక్టర్‌ సుధాకర్‌పై పోలీసుల దమననీతి ఒకే విధంగా ఉందని వర్లరామయ్య వ్యాఖ్యానించారు.

 

మెంటల్ ఆస్పత్రి సూపరిడెంట్, డాక్టర్ రామిరెడ్డిల ఫోన్ కాల్స్ పరిశీలించాలని ఈ సందర్భంగా వర్ల డిమాండ్ చేశారు. సుధాకర్‌ను శారీరకంగా, మానసికంగా హింసించిన డాక్టర్ రామిరెడ్డిని సీబీఐ అరెస్ట్ చేయాలన్నారు. దళిత వర్గాలు వైసీపీ ప్రభుత్వం పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. మెంటల్ ఆస్పత్రిలో సుధాకర్‌కు ఇచ్చిన వైద్యంపై పొరుగు రాష్ట్రాల వైద్య నిపుణులతో పరీక్ష చేయించాలని వర్ల డిమాండ్ చేశారు.

Updated Date - 2020-06-06T23:33:05+05:30 IST