వైసీపీ రాజ్యసభకు ముద్దాయిలను పంపుతోంది: వర్ల రామయ్య

ABN , First Publish Date - 2020-03-16T20:29:12+05:30 IST

వైసీపీ రాజ్యసభకు ముద్దాయిలను పంపుతోందని టీడీపీ నేత వర్ల రామయ్య ఆరోపించారు. కోర్టుల చుట్టూ తిరుగుతున్నవారిని రాజ్యసభకు ఎందుకు పంపుతున్నారో సీఎం జగన్‌ను ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు.

వైసీపీ రాజ్యసభకు ముద్దాయిలను పంపుతోంది: వర్ల రామయ్య

అమరావతి: వైసీపీ రాజ్యసభకు ముద్దాయిలను పంపుతోందని టీడీపీ నేత వర్ల రామయ్య ఆరోపించారు. కోర్టుల చుట్టూ తిరుగుతున్నవారిని రాజ్యసభకు ఎందుకు పంపుతున్నారో సీఎం జగన్‌ను ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. అయోధ్యరామిరెడ్డిలాంటి నేరస్థుడు రాజ్యసభకు వెళ్లడం దురదృష్టకరమన్నారు. మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ ఇక్కడే ఉండి జగన్‌ చూసుకోవాలని, రాజ్యసభకు వెళ్లి పరువు తీయొద్దని ఎద్దేవాచేశారు. వైసీపీ నేతల గొంతులు రాజ్యసభలో లేస్తాయా? అని ప్రశ్నించారు. మన రాష్ట్రం గురించి వీళ్లు ఏం మాట్లాడగలరని నిలదీశారు. రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యకు వీళ్ల జాతకాలన్నీ తెలుసని వర్ల రామయ్య వ్యాఖ్యానించారు.

Updated Date - 2020-03-16T20:29:12+05:30 IST