వైసీపీ రాజ్యసభ అభ్యర్థులపై వర్ల రామయ్య కామెంట్స్

ABN , First Publish Date - 2020-06-19T18:36:21+05:30 IST

వైసీపీ రాజ్యసభ అభ్యర్థులపై టీడీపీ నేత వర్ల రామయ్య విమర్శలు చేశారు.

వైసీపీ రాజ్యసభ అభ్యర్థులపై వర్ల రామయ్య కామెంట్స్

అమరావతి: వైసీపీ రాజ్యసభ అభ్యర్థులపై టీడీపీ నేత వర్ల రామయ్య విమర్శలు చేశారు. నేరచరిత్ర ఉన్న ఒక ముద్దాయి మోపిదేవి వెంకటరమణను సీఎం జగన్ ఎంపిక చేశారని విమర్శించారు. ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లే వ్యక్తి అని అన్నారు. ఇంకొకరు  అయోధ్య రామిరెడ్డి.. ఆయనపై దేశ వ్యాప్తంగా 10 కేసులు ఉన్నాయన్నారు. ఈయనను పెద్దల సభకు ముఖ్యమంత్రి ఎంపిక చేశారని విమర్శించారు. మరొక వ్యక్తి పరిమాల్ నత్వాని ఈయన ఏపీకి చెందిన వ్యక్తి కాదని, అంబానీలకు సంబంధించిన వ్యక్తి అని అన్నారు. ఆయన్ను ఏ రకంగా ఎంపిక చేశారో తెలియదన్నారు. పెద్దల సభకు ఇలాంటి వ్యక్తులను కాకుండా మంచివాళ్లను పెట్టాలని ఎమ్మెల్యేలకు పిలుపు ఇచ్చానని.. వర్ల రామయ్యగా తాను పోటీలో నిలుచున్నానని అన్నారు. తనకు ఎలాంటి క్రిమనల్ చరిత్ర లేదన్నారు. అంబేద్కర్ భావజాలన్ని, అట్టడుగు, పేద, బలహీన వర్గాల వాణిని వాడిగా, వేడిగా రాజ్యసభలో వినిపిస్తానని అన్నారు.

Updated Date - 2020-06-19T18:36:21+05:30 IST