ఫోన్ ట్యాప్ చేయట్లేదని చెప్పే ధైర్యం ఈ ప్రభుత్వానికుందా?: వర్ల రామయ్య

ABN , First Publish Date - 2020-08-18T18:58:26+05:30 IST

అమరావతి: ఫోన్ ట్యాపింగ్‌పై టీడీపీ అధినేత చంద్రబాబుకి రాష్ట్ర డీజీపీ లేఖ రాయడంపై వర్ల రామయ్య అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఫోన్ ట్యాప్ చేయట్లేదని చెప్పే ధైర్యం ఈ ప్రభుత్వానికుందా?: వర్ల రామయ్య

అమరావతి: ఫోన్ ట్యాపింగ్‌పై టీడీపీ అధినేత చంద్రబాబుకి రాష్ట్ర డీజీపీ లేఖ రాయడంపై వర్ల రామయ్య అభ్యంతరం వ్యక్తం చేశారు. సాక్ష్యం ఇస్తేనే దర్యాప్తు చేస్తామనడం సరికాదని ట్విట్టర్ వేదికగా ఆయన సూచించారు. ‘‘ఫోన్ ట్యాపింగ్‌పై చంద్రబాబుకు రాష్ట్ర డీజీపీ లేఖ రాయడo అభ్యంతరకరం. సాక్ష్యం ఇస్తేనే దర్యాఫ్తు చేస్తామన్నట్లు అనడం సరికాదు. చంద్రబాబుగారి లేఖ, పత్రికలో వార్తలు ఎందుకు ‘సుమోటు’ గా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయరు? ఫోన్ ట్యాపింగ్ చేయడం లేదని చెప్పే ధైర్యం ఈ ప్రభుత్వానికి వుందా?’’ అని వర్ల రామయ్య ప్రశ్నించారు.

Updated Date - 2020-08-18T18:58:26+05:30 IST