ఇది నిరంకుశ పాలన: వర్లరామయ్య

ABN , First Publish Date - 2020-10-31T18:25:43+05:30 IST

అమరావతి: దళితు రైతుల్ని పరామర్శించడానికి బయలుదేరిన.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్యను

ఇది నిరంకుశ పాలన: వర్లరామయ్య

అమరావతి: దళితు రైతుల్ని పరామర్శించడానికి బయలుదేరిన.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్యను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న టీడీపీ నేతల గృహ నిర్బంధాలను ఆయన ఖండించారు. ఈ సందర్భంగా వర్ల రామయ్య మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది అరాచకపాలన, అప్రజాస్వామికం, నిరంకుశ పాలన అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాజ్యాంగంలోని 19వ ఆర్టికల్‌ను ధిక్కరించి.. ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్న పరిపాలన అంటూ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పోలీస్‌ రాజ్యం నడుస్తోందని వర్ల రామయ్య మండిపడ్డారు. 


Read more