ఆ జంట గవర్నర్‌ను ఎందుకు కలిసిందో!: వర్ల
ABN , First Publish Date - 2020-08-22T09:26:14+05:30 IST
తెలుగుదేశం పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య శుక్రవారం ముఖ్యమంత్రి జగన్‌నుద్దేశించి ట్వీట్ చేశారు.
విజయవాడ, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య శుక్రవారం ముఖ్యమంత్రి జగన్‌నుద్దేశించి ట్వీట్ చేశారు. ‘‘ముఖ్యమంత్రి గారూ! పలు కేసుల్లో ముద్దాయిగా, సీబీఐతో చార్జిషీట్‌లు వేయించుకుని, ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరయ్యే ఏ 2 విజయసాయిరెడ్డితో కలిసి రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్ రాజేంద్రనాథ్‌రెడ్డి గవర్నర్‌ను కలవడం ఆశ్చర్యంగా ఉంది. ఈ జంట గవర్నర్‌ను ఎందుకు కలిసిందో చెప్పగలరా?’’ అని ప్రశ్నిస్తూ వర్ల ట్వీట్ చేశారు.