సౌండ్ బాక్సుల్లో సారా..!
ABN , First Publish Date - 2020-10-27T20:17:15+05:30 IST
జగన్ ప్రభుత్వం మద్యం ధరలు విపరీతంగా పెంచడంతో మందుబాబులు..

తూ.గో. జిల్లా: జగన్ ప్రభుత్వం మద్యం ధరలు విపరీతంగా పెంచడంతో మందుబాబులు నాటు సారావైపు పరుగులు తీస్తున్నారు. దీంతో సారా వ్యాపారులు అక్రమ రవాణాకు కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులో ముగ్గురు వ్యక్తులు రెండు మోటారు సైకిళ్లపై సారా రవాణా చేస్తూ పోలీసులకు చిక్కారు. అయితే సారా రవాణా కోసం సౌండ్ బాక్సులను వినియోగిండంతో పోలీసులు అవాక్యయ్యారు. ముగ్గురిని అరెస్టు చేసి 55 లీటర్ల నాటు సారాను, రెండు బైక్‌లను సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.