దుర్గగుడి పాలకమండలి సభ్యురాలు వరలక్ష్మి రాజీనామా
ABN , First Publish Date - 2020-10-01T17:00:40+05:30 IST
బెజవాడ కనకదుర్గగుడి పాలకమండలి సభ్యురాలు వరలక్ష్మి తన పదవికి రాజీనామా చేశారు.
కృష్ణా జిల్లా: బెజవాడ కనకదుర్గగుడి పాలకమండలి సభ్యురాలు వరలక్ష్మి తన పదవికి రాజీనామా చేశారు. అక్రమ మద్యం రవాణా కేసులో నైతిక బాధ్యత వహిస్తూ ఆమె రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను సామినేని ఉదయభానుకు పంపారు. వరలక్ష్మి కారులో నిన్న మద్యం బాటిళ్లు పట్టుకున్న విషయం తెలిసిందే. వరలక్ష్మి కుమారుడు సూర్యప్రకాశ్ గుప్తాపై పోలీసులు కేసు నమోదు చేసి, డ్రైవర్ శివను అరెస్ట్ చేశారు.