మీరేం చెప్పినా నమ్మడానికి ప్రజలు మూర్ఖులు కాదు: అనిత

ABN , First Publish Date - 2020-09-05T20:20:53+05:30 IST

మీరేం చెప్పినా నమ్మడానికి ప్రజలు మూర్ఖులు కాదు: అనిత

మీరేం చెప్పినా నమ్మడానికి ప్రజలు మూర్ఖులు కాదు: అనిత

అమరావతి: పాదయాత్రలో మద్యపాన నిషేధం అని చెప్పిన జగన్‌ మహిళల్ని దారుణంగా మోసం చేశాడని టీడీపీ నేత వంగలపూడి అనిత మండిపడ్డారు. దశలవారీ మద్యపాన నిషేధంలో భాగంగా ధరలు పెంచామన్నారు..మీరేం చెప్పినా నమ్మడానికి ప్రజలు మూర్ఖులు కాదన్నారు. మద్యం పాలసీపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. జనాలను తాగుబోతులను చేయడానికే మద్యం ధరలను తగ్గించారన్నారు. వాలంటీర్లు కుక్కర్లలో నాటుసారా తయారు చేస్తున్నారని ఆరోపించారు. 

Updated Date - 2020-09-05T20:20:53+05:30 IST