-
-
Home » Andhra Pradesh » vangalapudi anita comments
-
భయపడటానికి వాళ్లు వైసీపీ కార్యకర్తలు కాదు: అనిత
ABN , First Publish Date - 2020-10-31T23:08:06+05:30 IST
చలో గుంటూరు కార్యక్రమంలో పాల్గొన్న మహిళలపై పోలీసుల దాడిని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఖండించారు. సీఎం జగన్, వైసీపీ కార్యకర్తల కోసమే పోలీసులు పనిచేస్తున్నారని విమర్శించారు. రౌడీలు, కబ్జాకోరులకు సంకెళ్లు

అమరావతి: చలో గుంటూరు కార్యక్రమంలో పాల్గొన్న మహిళలపై పోలీసుల దాడిని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఖండించారు. సీఎం జగన్, వైసీపీ కార్యకర్తల కోసమే పోలీసులు పనిచేస్తున్నారని విమర్శించారు. రౌడీలు, కబ్జాకోరులకు సంకెళ్లు వేయకుండా భూములిచ్చిన రైతుల్ని అరెస్ట్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. జగన్ భయపెడితే భయపడటానికి వాళ్లు వైసీపీ కార్యకర్తలు కాదన్నారు. ఆడవాళ్లని జుట్టుపట్టి ఈడ్చుకెళ్లడం, కడుపులో తన్నడం పోలీసులు చేయాల్సిన పనేనా? పోలీసులు చేసిన నేరం రుజువై రేపు కోర్టుల ముందు నిలబడితే జగన్మోహన్‌రెడ్డి వారి ముఖం కూడా చూడరని తెలిపారు.