-
-
Home » Andhra Pradesh » Vamsi go back in Mallavalli
-
మల్లవల్లిలో వంశీ గో బ్యాక్
ABN , First Publish Date - 2020-12-30T09:05:02+05:30 IST
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి గ్రామంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం రసాభాస అయింది. గన్నవరం ఎమ్మెల్మే వల్లభనేని వంశీమోహన్ కారును గ్రామస్థులు అడ్డుకున్నారు.

హనుమాన్ జంక్షన్ రూరల్, డిసెంబరు 29: కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి గ్రామంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం రసాభాస అయింది. గన్నవరం ఎమ్మెల్మే వల్లభనేని వంశీమోహన్ కారును గ్రామస్థులు అడ్డుకున్నారు. మల్లవల్లితో పాటుమడిచర్ల, బిళ్లనపల్లి, కొత్తపల్లి గ్రామాల వారికి కూడా మంగళవారం స్థలాల పంపిణీ కార్యక్రమం జరిగింది. పట్టాలు పంచేందుకు వచ్చిన ఎమ్మెల్యే వంశీని వేరే గ్రామస్థలకు మల్లవల్లిని కట్టబెట్టవద్దని అడ్డుకున్నారు. తమ గ్రామంలోని స్థలాలు బయటి వ్యక్తులకు కేటాయించవద్దని, రేషన్ కార్డుదారులైన 1,678 మందికి కూడా పట్టాలు వచ్చాకే అందరం కలిసి తీసుకుంటామని చెప్పి.. 500 మంది లబ్ధిదారులు పట్టాలు తీసుకోవడానికి నిరాకరించారు.